వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేయాలని డిమాండ్ చేస్తున్న NPRD సంఘం
వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేయాలని డిమాండ్ చేస్తున్న NPRD సంఘం
నేటి నిఘా న్యూస్:
👉వికలాంగుల పెన్షన్ 6000 లకు వెంటనే పెంచాలి
👉వికలాంగుల చట్టాల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు విఫలం
పెన్షన్ పెంచకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
👉NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య
ఈరోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజామాబాదు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం బోధన్ పట్టణంలోని ఉర్దూ ఘర్ లో NPRD రాష్ట్ర కమిటీ సభ్యులు గైని రాములు అధ్యక్షతన జరిగింది*
*ఈ సమావేశంలో NPRD రాష్ట్ర కార్యదర్శి యం అడివయ్య,రాష్ట్ర ఉపాధ్యక్షులు యం బస్వారాజు పాటిల్ మాట్లాడుతూ*
2011జనాభా లెక్కల ప్రకారం దేశంలో 2.21శాతం మంది వికలాంగులు ఉన్నారని, ఘనంకలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సామాజిక ఘనంకాల విభాగం విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం 19 శాతం మంది చూపు, వినికిడి లోపం కలిగి ఉన్నారని, 8శాతం మంది బహుళ వైకాల్యం కలిగి ఉన్నారని అన్నారు.76శాతం మంది గ్రామీణ ప్రాంతంలో,24శాతం మంది పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ మరియు ప్రభుత్వయేతార సౌకర్యాలు వికలాంగులకు అందడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది వికలాంగులు ఉంటే పెన్షన్స్ కేవలం 5.75లక్షల మందికే వస్తున్నాయని అన్నారు.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను ప్రకటించి, ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.శరీరక వికలాంగుల రోస్టర్ 10 లోపు తగ్గిస్తూ స్టేట్ సభర్డినేట్ సర్వీస్ రూల్స్ సవరించాలని డిమాండ్ చేశారు.అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అన్నారు.నిరుద్యోగ వికలాంగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యంతో ప్రత్యేక పథకాన్ని ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.వికలాంగులపై జరుగుతున్న వేధింపులు అరికట్టెందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవలని అన్నారు. తీవ్ర వైకాల్యం కలిగిన వికలాంగులకు ప్రత్యేక అలావెన్స్ ఇవ్వాలని నిర్ణయం చేసిన ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.పెండింగ్ లో ఉన్న వివాహ ప్రోత్సాహకం నిధులు వెంటనే విడుదల చేయాలని అన్నారు. రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. అధికారులు వారి వైఖరి మార్చుకోకుంటే తగిన మూల్యం చేల్లించుకుంటారని అన్నారు.సామూహిక ప్రాంతాలన్నీ అవరోధ రహితంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసి 4 ఏండ్లు అవుతున్న ఎలాంటి పురోగతిలేదన్నారు.2016వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం అమలు పర్యవేక్షణ కోసం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో కో ఆర్డినేషన్ కమిటీలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. మానసిక, అంటీజం, హేమోఫిలియా, సికిల్ సెల్ కండరాల క్షినత వంటి వైఖల్యాలు కలిగిన వికలాంగుల సంక్షేమo కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మానసిక వైకల్యం కలిగిన విద్యార్థులు 5 లక్షల మంది ఉన్నారని వీరికి ప్రభుత్వ ప్రయివేట్ పాఠశాలల్లో చదువుకునే హక్కు లేకుండా పోతుందని అన్నారు. 2009 విద్య హక్కు చట్టం, 2016 RPWD చట్టం మానసిక వైకాల్యం కలిగిన వారికి పాఠశాలల్లో అడ్మిషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముగ, చెవిటి వైకాల్యం కలిగిన విద్యార్థులు 2 లక్షల మంది ఉంటే వీరికి సైన్ లాంగ్వేజ్ అందుబాటులో ఉండడం లేదన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్తులను గుర్తించి వారికి విద్య అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.ఆసరా పెన్షన్స్ ప్రతి నెల పంపిణి చేయకపోవడం వలన లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.పెన్షన్ పెంచకుంటే రాష్ట్ర వ్యాపిత ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
*బోధన్ పట్టణంలో జూలై 31న NPRD నిజామాబాదు జిల్లా 3వ మహాసభలు*
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజామాబాదు జిల్లా 3వ మహాసభలు బోధన్ పట్టణంలో నిర్వహిస్తున్నామని జిల్లా అధ్యక్షురాలు పి కవిత, రాష్ట్ర కమిటీ సభ్యులు గైని రాములు తెలిపారు. మహాసభల్లో జిల్లాలో వికలాంగులు ఎదురుకుంటున్న సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాని అన్నారు. మహాసభలకు 500మంది ప్రతినిధులు హాజరు అవుతున్నారని అన్నారు. మహాసభలను జయప్రదం కోసం ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని కోరారు
ఈ కార్యక్రమంలో AIAWU జిల్లా అధ్యక్షులు యేశాల గంగాధర్, NPRD జిల్లా నాయకులు నాజీర్, రాములు, గోపాల్, ఎల్లయ్య, సావిత్రి, బీరప్ప,హామీనా బీ, రాజు, గంగారాం, హరిప్రియ, లక్ష్మి, సోని, లతో పాటు వివిధ మండలాల వికలాంగులు పాల్గొన్నారు
Comments
Post a Comment