నేటి నిఘా న్యూస్:

మరో జాతీయ వ్యవసాయ పోరాటం ఆగస్టు 9న 


** ఆగస్టు 9న 'కార్పొరేట్స్ క్విట్ ఇండియా డే'

      __పోరుబాటలో సంయుక్త కిసాన్ మోర్చా.

దేశంలో రైతులు, కార్మికులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పోరాటానికి సిద్ధమైంది. ఎంఎస్పీ చట్టం, రుణమాఫీ, పంటల బీమా, రైతులు, కార్మికుల పెన్షన్, విద్యుత్ ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవడం వంటి పెండింగ్ లో ఉన్న ఇతర డిమాండ్లపై ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర కార్మిక సంఘాలు, ఇతర టీయూలు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థులు, యువత, మహిళలు, ఇతర బహుజన వర్గాల సంఘాలతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తెలిపింది. బుధవారం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) జనరల్ బాడీ సమావేశం జరిగింది. రాజస్థాన్లోని సికార్ నుంచి రైతు నాయకులు అమ్రారామ్, బీహార్లోని కరకట్ నుంచి రాజారామ్సంగ్, బీహార్లోని అర్రా నుంచి సుదామ ప్రసాద్, తమిళనాడులోని దిండిగల్ నుంచి ఆర్. సచ్చితానందం ఎంపీగా గెలుపొందడం పట్ల జనరల్ బాడీ అభినందనలు తెలిపింది. ఈ జనరల్ బాడీ అధ్యక్ష వర్గంగా అశోక్ ధావలే, దర్శన్పాల్, యుధ్వీర్ సింగ్, బల్బీర్ సింగ్ రాజేవాల్, రావుల వెంకయ్య, మేధాపాట్కర్, సత్యవాన్, రుల్దు సింగ్ మాన్సా, సునీలం, అవిక్ సాహా, ఆశిష్ మిట్టల్, తాజిందర్ సింగ్ విర్క్, కన్వర్జిత్ సింగ్ వ్యవహరించారు. ఏఐకేఎస్ నేత హన్నన్ మొల్లా ప్రతినిధులకు స్వాగతం పలికారు. 17 రాష్ట్రాల నుంచి 143 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణను ఎస్కేఎం ప్రకటించింది.


జూలై 11వ తేదీ గురువారం నాడిక్కడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్కేఎం నేతలు హన్నన్ మొల్లా, సునీలం, అవిక్ సాహా, రావుల వెంకయ్య, ప్రేమిసింగ్ గెహ్లావత్, పి. కృష్ణప్రసాద్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్కేఎం నిర్ణయాలను వెల్లడించారు. ఈ నెల 16 నుంచి 18 వరకు మూడ్రోజులపాటు తమ డిమాండ్లపై ఎస్కేఎం రాష్ట్ర నాయకత్వం లోక్సభ, రాజ్యసభ ఎంపీలందరికీ వినతి పత్రాలను కలిసి ఇవ్వనుందని అన్నారు. తమ డిమాండ్లపై ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అభ్యర్థించనుందని తెలిపారు.


అలాగే ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ అపాయిం ట్మెంట్లను కోరుతున్నట్టు ఎస్కేఎం నేతలు తెలిపారు. వారు అపాయింట్మెంట్ ఇస్తే వారికి తమ డిమాండ్లతో కూడిన

మెమోరాండం సమర్పిస్తారని అన్నారు. "ఆగస్టు 9న దేశవ్యాప్తం గా నిరసన ప్రదర్శలను చేయాలని, క్విట్ ఇండియా డేని” కార్పొరేట్స్ క్విట్ ఇండియా డే"గా నిర్వహించాలని ఎస్కేఎం పిలుపునిచ్చింది. వ్యవసాయ ఉత్పత్తి, వాణిజ్యంలో డబ్ల్యూటీఓ నుంచి ఇండియా బయటకు రావాలని డిమాండ్ చేసింది. తీవ్ర నీటి సంక్షోభం, అప్పుల భారం, రోడ్డు కారిడార్లతో ఇండియా- పాకిస్తాన్ వాణిజ్యాన్ని తెరవడం వంటి పంజాబ్ డిమాండ్లకు సంబంధించి ఆగస్టు 17న పంజాబ్లో రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మంత్రులందరి ఇళ్ల వద్ద మూడు గంటలపాటు ఆందోళన చేపట్టనుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానా, మహా రాష్ట్ర, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర సమన్వయ కమిటీలు తమ సమావేశాలను ఏర్పాటు చేస్తాయి. బీజేపీని శిక్షించాలని, ఎస్కేఎం డిమాండ్ల ఆధారంగా రైతులలో స్వతంత్ర, భారీ ప్రచా రాన్ని నిర్వహిస్తారు. కార్మికులను ఇతర సంఘాలను కలుపుకుని రైతులు వాహన జాతాలు, పాదయాత్రలు, మహా పంచాయత్ లను నిర్వహిస్తారు. తమ తమ రాష్ట్రాల్లో నెలకొన్న రైతుల సమ స్యలను గుర్తించేందుకు, కేంద్ర కార్యాచరణ కార్యక్రమాలతో పాటు వారి ఆందోళన కార్యక్రమాలనూ రూపొందించేందుకు తక్షణమే అన్ని రాష్ట్రాల్లో ఎస్కేఎం రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి.”


* జనరల్ బాడీ ఆమోదించిన డిమాండ్లు


• అన్ని పంటలకు గ్యారెంటీ సేకరణతో 2+50 శాతంతో కూడిన ఎంఎస్పీ చట్టబద్ధంగా హామీ ఇవ్వాలి.


• వ్యవసాయ కార్మికులకు రుణభారం నుంచి విముక్తి కల్పించి రైతుల ఆత్మహత్యలకు ముగింపు పలకడానికి సమగ్ర రుణ మాఫీ చేయాలి.


• విద్యుత్ రంగం ప్రైవేటీకరణ ఆపాలి. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు.


• ప్రభుత్వ రంగం కింద అన్ని పంటలకు, పశుపోషణకు సమగ్ర బీమా కవరేజీ ఇవ్వాలి. రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల పీఏంఎఫ్ బీవై పథకాన్ని రద్దు చేయాలి.


• రైతులు, వ్యవసాయ కార్మికులందరికీ నెలకు రూ.10 వేలు పెన్షన్ ఇవ్వాలి.


• భూసేకరణ, పునరావాస చట్టం-2013ని అమలుచేయాలి. దేశమంతటా ప్రతి సంవత్సరం భూమి సర్కిల్ రేటును సవరించాలి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగం ప్రాజెక్టుల కోసం అక్రమంగా సేకరించడం వల్ల భూమిని కోల్పోయిన వారంద రికీ తగిన పరిహారం అందించాలి. బుల్డోజర్ రాజ్కు ముగిం పు పలకాలి. ముందస్తు పునరావాస ఏర్పాట్లు చేయకుండా మురికివాడ, నివాసాల కూల్చివేతను ఆపాలి.


• వ్యవసాయంలో కార్పొరేటీకరణ ఆపాలి. వ్యవసాయ ఉత్పత్తి, వాణిజ్యంలో బహుళజాతి కంపెనీలు వద్దు. వ్యవసాయంపై డబ్ల్యూటీఓ ఒప్పందం నుంచి ఇండియా బయటకు రావాలి.


• ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, విద్యుత్, నీటి పారుదల, పెట్రోలియం ఉత్పత్తులు, యంత్రాలు, ట్రాక్టర్లు వంటి వ్యవసాయ ఇన్పుట్లపై జీఎస్టీ ఆపాలి.


• రాజ్యాంగంలోని సమాఖ్య సూత్రాల ప్రకారం పన్ను విధించే రాష్ట్ర ప్రభుత్వాల హక్కును నిర్ధారించడానికి జీఎస్టీ చట్టాన్ని సవరించాలి.


• జీడీపీలో తగిన వాటాతో వ్యవసాయం కోసం ప్రత్యేక కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టాలి.


• కేంద్ర ప్రభుత్వంలో సహకార మంత్రిత్వ శాఖను రద్దు చేయాలి. రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా సహకా రాన్ని రాష్ట్ర అంశంగా ఉంచాలి. ఉత్పత్తి వర్గాలైన రైతులు, కార్మికుల ఖర్చుతో కార్పొరేట్ వర్గ ప్రయోజనాల కోసం అధికార కేంద్రీకరణను ప్రోత్సహించే బదులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మద్దతు ఇవ్వాలి.


• వన్యప్రాణుల ముప్పు కోసం శాశ్వత పరిష్కారాన్ని నిర్ధారిం చాలి. ప్రాణనష్టానికి పరిహారంగా రూ.కోటి, పంటలు, పశు

వుల నష్టానికి తగిన పరిహారం అందించాలి. 


• లఖింపూర్ భేరీ అమరవీరులతో సహా చారిత్రాత్మక రైతుల పోరాట అమరవీరుల కుటుంబాలకు పరిహారం అందించాలి.


• రైతుల పోరాటానికి సంబంధించిన అన్ని కేసులను ఉపసం హరించుకోవాలి. 736 మంది రైతు అమరవీరుల స్మారకా ర్థం సింగు, టిక్రీ సరిహద్దులో అమరవీరుల స్మారక స్థూపాన్ని నిర్మించాలి.

మరో జాతీయ వ్యవసాయ పోరాట ఉద్యమం కోసం మేము సైతం అంటూ రైతులు పండించే పంట దిగుబడి ధరల పెరుగుదల రేటు పెంపు పై సమిష్టిగా పోరాటం ఆగస్టు 9 మరో జాతీయ వ్యవసాయ పోరాట ఉద్యమం రైతుల పక్షాన నిలబడి ప్రజా సంఘాల నాయకులు రైతు కూలీలు అందరూ చేస్తున్న ప్రయత్నం నెరవేరాలని ఆశిద్దాం

జై కిసాన్ జై హింద్!

నేటి నిఘా న్యూస్ మీడియా డెస్క్

కట్టా నరేశ్ కుమార్ నాయక్

జర్నలిస్ట్ 

__________________________________

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026