నేటి నిఘా న్యూస్ 11/04/2026
నేటి నిఘా న్యూస్ 📰 ఏప్రిల్ 11, 2026 నాటి చారిత్రక విశేషాలు, స్పెషల్ న్యూస్.2. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న సంగతులు (ఏప్రిల్ 2026)గ్లోబల్ సెమీకండక్టర్ సదస్సు: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న చిప్ కొరతను అధిగమించడానికి తైవాన్ మరియు భారత్ మధ్య కీలక ఒప్పందం నేడు కుదిరింది.
1. చరిత్రలో ఈరోజు (ఏప్రిల్ 11) - ప్రత్యేకత నేడు భారతదేశంలో సామాజిక సంస్కరణల పితామహుడిని స్మరించుకునే గొప్ప రోజు.జ్యోతిరావు ఫూలే జయంతి: భారతీయ సామాజిక విప్లవకారుడు, కుల నిర్మూలనకు మరియు మహిళా విద్య కోసం పోరాడిన మహాత్మా జ్యోతిరావు ఫూలే జన్మదినం (1827). ఆయన గౌరవార్థం దేశవ్యాప్తంగా సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.
- జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం: గర్భిణీ స్త్రీల ఆరోగ్యం మరియు ప్రసవ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడానికి భారత ప్రభుత్వం నేడు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. (ఇది కస్తూర్బా గాంధీ జన్మదినం కూడా).
- అంతర్జాతీయ పార్కిన్సన్ వ్యాధి దినోత్సవం: మెదడు సంబంధిత పార్కిన్సన్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా నేడు కార్యక్రమాలు నిర్వహిస్తారు.
2. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న సంగతులు (ఏప్రిల్ 2026)గ్లోబల్ సెమీకండక్టర్ సదస్సు: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న చిప్ కొరతను అధిగమించడానికి తైవాన్ మరియు భారత్ మధ్య కీలక ఒప్పందం నేడు కుదిరింది.14 అంబేద్కర్ జయంతి సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్న RTI 2005 సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ.అధ్వర్యంలో భారత రత్నా రాజ్యాంగ నిర్మాత డా బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వ్యాస రచన, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నట్లు RTI కమిటి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కట్టా నరేశ్ కుమార్ నాయక్ పేర్కొన్నారు.క్లైమేట్ యాక్షన్: ఐరోపా దేశాలు 2026 వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి "గ్రీన్ కూలింగ్" టెక్నాలజీని విరివిగా వాడాలని నిర్ణయించాయి.
14 అంబేద్కర్ జయంతి సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్న RTI 2005 సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ.
అధ్వర్యంలో భారత రత్నా రాజ్యాంగ నిర్మాత డా బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వ్యాస రచన, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నట్లు RTI కమిటి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కట్టా నరేశ్ కుమార్ నాయక్ పేర్కొన్నారు.క్లైమేట్ యాక్షన్: ఐరోపా దేశాలు 2026 వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి "గ్రీన్ కూలింగ్" టెక్నాలజీని విరివిగా వాడాలని నిర్ణయించాయి.
3. భారత రాజకీయాలు - తాజా అప్‌డేట్స్పార్లమెంటులో కీలక బిల్లు: డిజిటల్ డేటా ప్రొటెక్షన్ చట్టంలో కొత్త సవరణలను కేంద్ర ప్రభుత్వం నేడు ప్రతిపాదించింది. దీనివల్ల సోషల్ మీడియా వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి మరింత రక్షణ లభిస్తుంది.సరిహద్దు భద్రత: భారత్-చైనా సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు రెండు దేశాల సైనిక అధికారుల మధ్య 25వ రౌండ్ చర్చలు నేడు ప్రారంభమయ్యాయి.
4. తెలుగు రాష్ట్రాల అప్‌డేట్స్ (TG & AP) లో
తెలంగాణ (TG) - ప్రభుత్వం చేస్తున్న పనులు:
- జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు: రాష్ట్రవ్యాప్తంగా మహాత్మా ఫూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారు. బీసీ సంక్షేమం కోసం ప్రభుత్వం కొత్త కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.
- రైతు భరోసా: యాసంగి నిధుల పంపిణీ చివరి దశకు చేరుకుంది. పెండింగ్‌లో ఉన్న 5 ఎకరాల లోపు రైతులందరికీ నేటి సాయంత్రానికి నిధులు జమ కానున్నాయి.
- హైదరాబాద్ స్మార్ట్ డ్రైనేజీ: వర్షాకాలం రాకముందే నగరంలో నాలా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ (AP) - ప్రభుత్వం చేస్తున్న పనులు:అమరావతి భూసేకరణ: రాజధానిలో కీలక రహదారుల నిర్మాణానికి అవసరమైన భూములకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన పరిహారం నిధులను ప్రభుత్వం నేడు విడుదల చేసింది.
- ఉచిత గ్యాస్ సిలిండర్ (దీపం): 'దీపం 2.0' పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఈ వారం నుండి సిలిండర్ల పంపిణీ ప్రారంభం కానుంది.
- అన్న క్యాంటీన్లు: రద్దీ ఎక్కువగా ఉన్న రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్‌ల వద్ద మరో 20 అన్న క్యాంటీన్లను మంత్రి నారాయణ నేడు ప్రారంభించనున్నారు.
- పోలవరం ప్రాజెక్టు: డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనుల వేగాన్ని పర్యవేక్షించేందుకు కేంద్ర జలశక్తి శాఖ బృందం నేడు ప్రాజెక్టును సందర్శించనుంది.
ముగింపు: ఏప్రిల్ 11వ తేదీ జ్యోతిరావు ఫూలే వంటి మహనీయుల ఆశయాలను గుర్తు చేసుకుంటూ, తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా సాగుతోంది.
మీకు వీటిలో ఏ పథకం గురించి గానీ, లేదా జ్యోతిరావు ఫూలే చరిత్ర గురించి గానీ మరిన్ని వివరాలు కావాలా? దరఖాస్తు విధానం తెలుసుకోవాలనుకుంటున్నారా?
*నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన రెండు వారాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 338 నమోదు జరిమానా 25,75,000/- విధించిన సంబంధిత కోర్టులు పోలీస్ కమిషనర్ వెల్లడి* మీడియా సమావేశం
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ పి.ఎస్ లలో గడిచిన 2 వారాలలో డ్రంకన్ డ్రైవ్ లో 338 మంది పట్టు బడగా వారిని నిజామాబాదు , బోధన్ మరియు అర్మూర్ కోర్టులలో వారిని హాజరు పర్చగా ఇందులో 34 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని మిగిలిన వారికీ *25,75,000/- జరిమానా* విధించనైనది. కమిషనరేట్ పరిధిలో చేసిన తనిఖీలలో అధిక మొత్తములో త్రాగి వాహనములు నడిపి పోలీస్ వారికి పట్టుబడటం జరుగుచున్నది, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో వారి వారి పోలీస్ స్టేషన్ పరిధిలలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగముగా తేది:30-3-2026 నుండి తేది: 11-4-2026 వరకు వాహన తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 338 కేసుల నమోదు చేయడం జరిగింది.
🔷 *నిజామాబాదు పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పి.ఎస్*,. కింది గమనికలు తెలియజేయడం జరిగింది.
1) ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదు
2) వాహనాదారులు వాహనానికిసంబంధించినటువంటి పత్రములు సక్రమముగా తమ వద్ద ఉంచుకోగలరు.
3) డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన వారి లైసెన్స్ 6 నెలల పాటు సస్పెండ్ చేయబడును
4) మద్యం త్రాగి వాహనం నడిపి అనుకోని రోడ్ ప్రమాదం జరిగినట్లయితే ఇన్సూరెన్సు లభించదు.
5) మైనర్లు తాగి వాహనం నడిపి పోలీస్ వారికి దొరికినటైతే మైనర్ మరియు వెహికల్ ఓనర్ పైన ఛార్జ్ షీట్ నమోదు చేయబడును అలాగే జైలు శిక్ష విధించే అవకాశం కలదు.
6) ఒక సారి కంటే ఎక్కువ సార్లు పట్టుబడినట్లయితే జైలు శిక్ష విధించబడును
7) *మోటర్ వెహికల్ యాక్ట్ 1989 (చట్టం సవరణ - 2019)* అమలులో ఉన్నందున డ్రంక్ అండ్ డ్రైవ్ లో మొదటిసారి పట్టుబడినట్లయితే 10,000/- జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా తో పాటు జైలు శిక్ష విధించబడును. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ లో రెండోసారి పట్టుబడినట్లైతే 15,000/- జరిమానా లేదా జైలు శిక్ష లేదా జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడును.
నిజామాబాదుప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో
భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాలను జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఐ డి ఓ సి సమావేశ మందిరంలో నిర్వహించడం జరిగినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు తెలియజేశారు. ఈ సమావేశానికి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అడిషనల్ కలెక్టర్ రెవిన్యూ కిరణ్ కుమార్ గారు అధ్యక్షత వహించారు. ముందుగా
1) *హెచ్పీవీ టీకాల కార్యక్రమం పై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం* ను నిర్వహించడం జరిగింది. గర్భాశయం ముఖద్వార క్యాన్సర్ రాకుండా ముందస్తు జాగ్రత్తగా 14 సంవత్సరాల బాలికల కోసం ఈ హెచ్ పి వి టీకాలను ఇవ్వడం జరుగుచున్నదని అన్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 14 సంవత్సరాల పుట్టినరోజులు జరుపుకొని 15వ సంవత్సరము పుట్టినరోజును జరుపుకో నటువంటి బాలికలు మాత్రమే అర్హులని అన్నారు.
హెచ్పివీ టీకాల కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో అమలుపరుస్తూ పర్యవేక్షించడానికి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ హెచ్ పి వి టీకాల కార్యక్రమాన్ని భారత దేశంలోనీ రాజస్థాన్ రాష్ట్రంలో గల అజ్మీర్ నగరంలో ప్రధాని మోడీ ,ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభించగా , తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మరియు నిజాంబాద్ పట్టణంలో మార్చి 8వ తేదీన ప్రారంభించడం జరిగింది. కలెక్టర్ అధ్యక్షతన డిఎం అండ్ హెచ్ ఓ కన్వీనర్ గా ఉన్న జిల్లా స్థాయి సమన్వయ కమిటీలో డి సి హెచ్ ఎస్, జి జి హెచ్ సూపర్డెంట్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల అధికారులు జిల్లా పంచాయతీ అధికారి సంబంధాల సమాచార అధికారి మరియు డి ఐ ఓ డాక్టర్ అశోక్ సభ్యులుగా గల కమిటీ పర్యవేక్షణ మరియు సమన్వయంతో జిల్లాలోని అర్హులైన 14 సంవత్సరాల బాలికలు అందరికీ హెచ్పీవీ టీకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.
2) *కీటక జనీత వ్యాధుల నియంత్రణపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశము*
నిర్వహించడం జరిగింది
ఈ సమావేశంలో కలెక్టర్ అధ్యక్షతన డిఎంహెచ్వో నెంబర్ కన్వీనర్ గా మొత్తం 12 మంది సభ్యులు గల జిల్లా స్థాయి సమన్వయ కమిటీ ఉంటుందన్నారు. జిల్లాలో కీటక జనతా వ్యాధుల నియంత్రణను అదుపులో ఉంచుటకై వివిధ శాఖల సహకారంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పనిచేసినప్పుడు ఎటువంటి కీటక జనత వ్యాధులు డెంగీ, మలేరియా, ఫైలేరియా, చికెన్ గున్యా, మెదడువాపు ,లాంటి వ్యాధులు జిల్లాలో ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు అన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టరు (రెవెన్యూ )కిరణ్ కుమార్ గారు మాట్లాడుతూ గ్రామపంచాయతీలు , మున్సిపల్ కార్పొరేషన్ మరియు పురపాలక సంఘాలలో మొరుగు కాల్వల నిర్వహణ, నీటి నిల్వలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం, యాంటీ మస్కిటో, యాంటీ లార్వెల్ స్ప్రే చేయడం ద్వారా, పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా దోమలు పుట్టకుండా లార్వా బ్రీడింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని అన్నారు.
గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా తాగునీటి పైపుల లీకేజీలు లేకుండా నల్లాల వద్ద నీరు నిల్వలు ఉండకుండా ప్రతి నెలలకు టోటల్ నిర్వహించడం ద్వారా మస్కిటో బ్రీడింగ్ ను తగ్గించవచ్చని అన్నారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడి సూపర్వైజర్స్ అంగన్వాడీ టీచర్లు ద్వారా విస్తృతంగా యాంటీ మలేరియా మంత్ యాక్టివిటీస్ లో పాల్గొని అంగన్వాడీ కేంద్రాల చుట్టుపక్కల పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ మద్దతుస్ కమిటీలో కీటక జనక వ్యాధులపై అవగాహన కలిగించడం ద్వారా డెంగీ లాంటి వ్యాధుల్ని నివారించవచ్చు అన్నారు.
జిల్లాలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో అన్ని వసతి గృహాల్లో పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ విద్యార్థులకు కీటక జనత వ్యాధులపై సూచనలు, జాగ్రత్తలు తెలియజేయాలన్నారు.
విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు యాంటీ మలేరియా ఆంటీ డెంగ్యూ మంత్రులు నిర్వహించే కార్యక్రమాల్లో చిరుకుగా పాల్గొనాలని , విస్తృతంగా అవగాహన కలిగించాలని అన్నారు.
జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామస్థాయి ,సమన్వయ కమిటీ సమావేశాలలో కీటక జనక వ్యాధులపై ముఖ్యంగా డెంగ్యూ లాంటి వ్యాధులపై విస్తృతంగా అవగాహన కలిగించడమే కాకుండా గ్రామo లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లో మెప్మా ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూపు సభ్యులందరికీ మస్కిటో మరియు యాంటీ లార్వా కార్యక్రమాల పై విస్తృత అవగాహన కలిగించాలని, ప్రతి గృహ పరిసరాల పరిధిలో నీటి నిల్వలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకునేలా మరియు ఆయిల్ బాల్స్ లాంటివి వాడేలా అవగాహన కలిగించాలన్నారు. జిల్లా పౌర సంబంధాల సమాచార శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో విస్తృతంగా కీటక జనత వ్యాధుల నియంత్రణపై ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా అవగాహన కలిగించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరియు జిల్లాస్థాయిలో రాపిడ్ రెస్పాన్స్ టీం లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా వడదెబ్బపై తీసుకోవలసిన జాగ్రత్తలు, వడదెబ్బ నివారణపై చేయవలసినవి చేయకూడనివి వివరించారు.ఇంకా ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జడ్పీ సీఈవో బి సాయ గౌడ్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, డీఈవో పి.అశోక్ , డి డబ్ల్యు ఓ పద్మ ,ట్రైబల్ వెల్ఫేర్ అధికారి నాగో రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాకేష్, డి ఐ
ఓ డాక్టర్ అశోక్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ వినయ్ కుమార్, డిప్యూటీ డిఎంహెచ్వోలు డాక్టర్ రవీందర్ ,డాక్టర్ అశ్విని, డాక్టర్ సమత, డి హెచ్ ఈ లు గన్ పూర్ వెంకటేశ్వర్లు, సలీం ,మనోహర్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment