నేటి నిఘా న్యూస్ ✍️ తేదీ:31/03/2026

నేటి నిఘా 🔎 న్యూస్ అవినీతి అక్రమాల పై నీడల వెంటాడే నేటి నిఘా న్యూస్ @Netinigha 
 నేడు 2026 మార్చి 31. చరిత్రలో ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఈ రోజును అనేక కీలక పథకాల గడువుగా మరియు కొత్త నిర్ణయాల అమలుకు వేదికగా ఎంచుకున్నాయి. ఆ వివరాలతో కూడిన ప్రత్యేక కథనం ఇక్కడ ఉంది:
నేటి చారిత్రక ప్రాధాన్యత
  • మావోయిస్ట్ రహిత ఆంధ్రప్రదేశ్: కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్చి 31 గడువు కంటే ఒక రోజు ముందుగానే, అంటే మార్చి 30, 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా DGP హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు.
  • మహవీర్ జయంతి: నేడు దేశవ్యాప్తంగా జైన్ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడి జన్మదినాన్ని పురస్కరించుకుని మహవీర్ జయంతి జరుపుకుంటున్నారు.
  • భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్: 1990లో సరిగ్గా ఇదే రోజున భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్‌కు మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్: నేటి కీలక పనులు & పథకాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు మరియు పేదలకు సంబంధించి కీలక నిర్ణయాలు అమలు చేస్తోంది:
  • ఆస్తి పన్ను రాయితీ (50% వడ్డీ మాఫీ): మున్సిపల్ ఆస్తి పన్ను బకాయిలపై 50% వడ్డీ రాయితీ పొందేందుకు నేడే (మార్చి 31) చివరి అవకాశం. రేపటి నుండి ఈ రాయితీ వర్తించదు.
  • ఉచిత ఇళ్ల పథకం: 2029 నాటికి అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తోంది.
  • దివ్యాంగులకు మోటరైజ్డ్ త్రిచక్ర వాహనాలు: అర్హులైన దివ్యాంగులకు మోటరైజ్డ్ త్రిచక్ర వాహనాల పంపిణీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది.

తెలంగాణ: నేటి కీలక పనులు & పథకాలు

తెలంగాణలో ఉద్యోగుల సంక్షేమం మరియు పౌర సేవలపై ప్రభుత్వం దృష్టి సారించింది:
  • వన్ టైమ్ సెటిల్మెంట్ (90% వడ్డీ మాఫీ): జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో ఆస్తి పన్ను బకాయిలపై 90% వడ్డీ మాఫీ పొందేందుకు నేడే ఆఖరి తేదీ. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే ఈ చెల్లింపులు స్వీకరించబడతాయి.
  • నగదు రహిత ఆరోగ్య పథకం (Cashless Health Scheme): ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం ప్రవేశపెట్టిన నగదు రహిత 4 పథకం ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తోంది.
  • క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు: క్రీడల్లో రాణించే విద్యార్థులకు భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కొత్త క్రీడా విధానాన్ని (Sports Policy) అమల్లోకి తెచ్చింది.
  • మహాలక్ష్మి & చేయూత పథకాలు: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్ మరియు రూ. 10 లక్షల ఆరోగ్య బీమా వంటి సంక్షేమ పథకాల పర్యవేక్షణ నేడు ముమ్మరంగా సాగుతోంది.

జాతీయ మరియు ఆర్థిక మార్పులు

  • కొత్త ఆదాయ పన్ను చట్టం: 2026 మార్చి 31 వరకు సంపాదించిన ఆదాయానికి పాత నిబంధనలే వర్తిస్తాయి. ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అమల్లోకి రానుంది.
  • పీఎఫ్ వడ్డీ: ఈపీఎఫ్ (EPF) డిపాజిట్లపై 8.25% వడ్డీ రేటు నేటితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది.
ఈ విధంగా, మార్చి 31వ తేదీ అటు చారిత్రక ప్రాధాన్యతతో పాటు, ఇటు రెండు రాష్ట్రాల్లో ప్రజల ఆర్థిక, సామాజిక ప్రయోజనాలకు సంబంధించిన కీలక గడువుగా నిలుస్తోంది.
*వడదెబ్బపై ఆరోగ్య చైతన్య వేదిక కరపత్రాల ఆవిష్కరణ*
ఆరోగ్య చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఇందూర్ మదర్ హుడ్ హాస్పిటల్ సహకారంతో వడదెబ్బపై ముద్రించిన కరపత్రాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ మేడం  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్వో మాట్లాడుతూ ఆరోగ్య చైతన్య వేదిక సేవ సంస్థ ఆధ్వర్యంలో వడదెబ్బపై కరపత్రాలు వేయించి అవగాహన కలిగించడం హర్షించదగ్గ విషయం అన్నారు. అన్ని జాతియ ఆరోగ్య కార్యక్రమాలు మరియు ప్రజారోగ్యంపై ప్రజల్లో స్వచ్ఛందంగా అవగాహన కలిగించడం సంతోషించదగ్గ విషయమని ,ఇదే స్ఫూర్తితో జిల్లాలో ఇంకా అనేక కార్యక్రమాలపై స్వచ్ఛందంగా అవగాహన కలిగించాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆరోగ్య చైతన్య వేదిక స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపకులు మరియు రాష్ట్ర కన్వీనర్ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ వెంకటేష్, నియోజకవర్గ కన్వీనర్లు నిజాంబాద్ రూరల్ వై. శంకర్, నిజామాబాద్ అర్బన్ వి .ప్రవీణ్ రెడ్డి, ఆరోగ్య చైతన్య వేదిక ప్రతినిధులు హెచ్ ఈ ఓ కరిపే రవీందర్, డిహెచ్ఈలు వేణుగోపాల్, సలీం, మనోహర్ పాల్గొన్నారు.

*హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్స్ యూనియన్ డైరీ ఆవిష్కరించిన డిఎంహెచ్ఓ*
వైద్య ఆరోగ్యశాఖలోని హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్స్  యూనియన్ డైరీ ఆవిష్కరించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ మేడం. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్స్ సభ్యులంతా వైద్య ఆరోగ్యశాఖలోని అన్ని జాతియ ఆరోగ్య కార్యక్రమాలు, మాతా శిశు ఆరోగ్య సంరక్షణ, మాతా శిశు మరణాల నియంత్రణ, న్యూట్రిషన్, రక్తహీనత, జీవనశైలి వ్యాధులు గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్, వ్యాధినిరోధక టీకాలు, కీటక జనీత వ్యాధులు, చేతుల శుభ్రత , కుటుంబ నియంత్రణ తాత్కాలిక మరియు శాశ్వత పద్ధతులు , మహిళా ఆరోగ్యం, మానసిక వ్యాధులు, టీ హబ్, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధులపై అవగాహన, టీబి ముక్తభారత్ అభియాన్, పి సి పి ఎన్ డి టి చట్టం, స్త్రీ పురుష నిష్పత్తి, లింగ సమానత్వము, పాఠశాల ఆరోగ్యం మొదలగు ఆరోగ్య కార్యక్రమాలపై విస్తృతంగా క్షేత్రస్థాయిలో, పాఠశాలలో, కళాశాలల్లో, అవగాహన కలిగించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ వెంకటేష్, యూనియన్ బాధ్యులు ,DHE లు గన్పూర్ వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, సలీం, మనోహర్ పాల్గొన్నారు.
 
 పరిపాలనకు  ప్రాధాన్యత ఇవ్వడంలోనే  పార్టీలు తప్పటడుగు వేస్తున్నాయి.* ఎన్నికల మ్యానిఫెస్టోలు   వాగ్దానాలుగా మిగిలిపోతే.?, చట్టసభల్లో పాలక ప్రతిపక్షాల  దాడులు,  రాజకీయ, ఉద్యో గ  సిబ్బంది అవినీతి  ప్రజలను బలి పశువులను చేస్తున్నాయి .*
-వడ్డేపల్లి మల్లేశం 
"ప్రజాస్వామ్య వ్యవస్థకు ఉన్న సుగుణాలు  గెలుపే కంటే  ఆ పరిపాలన క్రమంలోనే పేద ప్రజలు ఓడిపోవడాన్ని  పాలకులు  కార్పొరేట్ సంస్థలు  గెలవడాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. ఇది ప్రజాస్వామ్య వైఫల్య o కాదు పాలకుల బాధ్యతా రాహిత్యం.  ఇక అధికార యంత్రాంగంలో  క్రింది నుండి పై స్థాయి వరకు ఉన్న  సిబ్బంది యొక్క అవినీతి  ప్రజల జలగలా పీల్చి  అవసరమైన సందర్భంలో ప్రభుత్వ అధినేతల సహకారాన్ని పొంది కేసుల నుండి తప్పించుకొనే ధోరణి  పాలకుల కనుసన్నల్లో  కొనసాగినంత కాలం  ఈ దేశంలో  ప్రజలు నిరంతరం ఓడిపోతూనే ఉంటారు". ఇక పాలకులు  ఎన్నికల సందర్భంలో  ప్రకటించే  మేనిఫెస్టో అబద్ధాలతో ప్రారంభించి మూడు  పువ్వులు ఆరు కాయలుగా  మారినట్లు  వేదికల మీద చట్టసభల్లో అధికార కార్యక్రమాలలో అబద్ధాలతో  తప్పించుకుంటూ ప్రతిపక్షాల విమర్శలకు సరైన జవాబులు చెప్పకుండా దాటవేస్తూ  తమ విధానాలలో  స్పష్టత ప్రకటించకుండా ఐదేళ్లు  గడపడమే ముఖ్యం వీరికి. తిరిగి మళ్లీ అధికారానికి రావడమే అంతకంటే ప్రాముఖ్యత గల అంశం.  అంతేకాదు 20 ఏళ్ల పాటు మేమే కొనసాగుతాం అని డా o బికాలు ప్రదర్శించడం  ఇవాళ రాజకీయ పార్టీల యొక్క దినచర్య  ప్రాథమిక అంశంగా మిగిలిపోయింది. 
ఎన్నికల మ్యానిఫెస్టోలు- అమలు చేస్తున్న విధానాలు 
  సాధ్యాసాధ్యాలను  ఊహించకుండానే  పరిశీలించకుండానే  ఎదుటి రాజకీయ పార్టీ ఇచ్చిన హామీలకు రెట్టింపు  వాగ్దానాలను చేయడంతో పాటు ఎన్నికల్లో గెలవడానికి చేసిన ఆరాటం తప్పిదాలు అంతా ఇంతా కాదు. ఆ రకంగా గెపరిపాలనలవడానికి  వేసిన పన్నాగాల మధ్య అధికార పార్టీగా  ప్రభుత్వ ఏర్పాటు తర్వాత  ఆచరణలో సాధ్యం కాక, వివిధ వర్గాల నుండి వచ్చే డిమాండ్ ను పరిష్కరించే  సామర్థ్యం ప్రతిభ అధికార పార్టీలో లేక,  చట్టసభల్లో బయట ప్రతిపక్షాలు ప్రశ్నించే ప్రశ్నలకు సమాధానాలను దాటవే  దాటవేస్తూ ప్రజల ప్రజాస్వామిక వాదుల మేధావులను కూడా పిచ్చివాళ్లుగా చేస్తున్న చట్టసభల పనితీరు పార్లమెంటు నుండి  రాష్ట్ర శాసనసభలు అంతేకాదు బహుశా గ్రామ పంచాయితీ వరకు కూడా ఇదే విధానం కొనసాగుతుందని అన్నా అభ్యంతరం లేదు. బడ్జెట్ అంటేనే అంకెల గారడి అని  భవిష్యత్తును ముందుగానే ఊహించి  నిధులను మంజూరీ చేసినట్టు ప్రకటించి ఆ ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఖర్చు చేయకపోగా కేటాయించినవి కూడా అంతంత మాత్రంగానే ఉన్నప్పుడు  ఆ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదు అని అర్థం. "ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి?  ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి?  మౌలిక సమస్యల పరిష్కరించడం ద్వారా ప్రజలను  తమ కాళ్ళ మీద తమ నిలబడే విధంగా తీర్చి దిద్దవచ్చు అనే ఆలోచన   అసమానతలు అంతరాలు వివక్షత లేనటువంటి సమ సమాజాన్ని స్థాపించే క్రమంలో  విద్యా వైద్యము సామాజిక న్యాయము ఉపాధి  ఇండ్ల సౌకర్యం కల్పించే విషయంలో  ముందుచూపు లేకపోవడం వలన  భారతదేశ వ్యాప్తంగా విద్యా వైద్యం వ్యాపారంగా మారి  ప్రభుత్వ ప్రతినిధులకు  బంధువులు స్నేహితులకు  ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వడంతో పాటు  మంత్రులు ముఖ్యమంత్రులు, ప్రధానితో సహా అందరూ కూడా ప్రైవేటు సంస్థల ప్రారంభోత్సవాలకు విచ్చేసి  ప్రభుత్వ రంగాన్ని నీరుగారు స్తున్న విషయం మనకు అందరికీ తెలుసు ".దూర దృష్టి, భవిష్యత్తు సవాళ్లు, విద్యా వైజ్ఞానిక సామాజిక ఆర్థిక శాస్త్రీయ సాంకేతిక రంగాలలో  ఎదురయ్యే సమస్యలు,  సవాళ్లను పరిష్కరించే నైపుణ్యాన్ని యువతలో సాధించడం కోసం ప్రణాళిక అంటూ పాలకులకు లేకపోవడం వలన  ప్రతి విషయంలోనూ మనకు సంబంధించి ఇతర దేశాల నుండి  సాంకేతిక పరిజ్ఞానాన్ని సేకరించుకోవడంతోనే సరిపెడుతున్నాం. ఇక దానిని ఆచరించి అమలు చేసే అవకాశం ఎక్కడిది? ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అంశాలను  పరిపాలన క్రమములో చట్టసభల ఆమోదంతో అమలు చేసిన దాఖలాలు అంతకు లేవు.  అందుకు బదులుగా  అధికార ప్రతిపక్షాలు పరస్పరం దాడులకు పాల్పడుతూ ప్రజలను పిచ్చివాళ్లుగా చూస్తూ  బలహీనులను చేస్తున్న సంగతి మనకు తెలుసు. ఆ క్రమంలో ఉద్భవించినదే  ప్రజలను  యాచకులుగా మార్చే ప్రక్రియ... ఎన్నికల సందర్భంలోనూ ఇతరత్రా చిన్నచిన్న కోరికలను అమలు చేస్తూ  ఉచితాలు తాయిలాలతో ప్రజలను మభ్యపెడుతూ ప్రజలు ప్రశ్నించకుండా ప్రతిఘటించకుండా  బుజ్జగించే ధోరణి కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు.
  పాలక ప్రతిపక్షాల పరస్పర దాడులు 
దేశ రాజధాని లో కల పార్లమెంటుతో సహా  రాష్ట్రాల శాసనసభలు  జిల్లా పరిషత్ మండల పరిషత్ మున్సిపల్ కౌన్సిల్ గ్రామపంచాయతీ వరకు కూడా  అధికార ప్రతిపక్షాలు పరస్పర దాడులు భిన్న ఆరోపణలతోనే తమ పబ్బం గడుపుతున్న తీరు జగమెరిగిన సత్యం.  ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ముఖ్యంగా  పనిగట్టుకొని  తమ కాలములో చేయని వాటిని పక్కనపెట్టి  అమలు చేసినటువంటి వాటిలో ఉన్న అనేక లొసు గులను దాచుకొని  ప్రస్తుత ప్రభుత్వాలను మాత్రం ఇచ్చిన హామీలు అమలు చేయాలని  నిలదీయడం కూడా కొంత  వివాదాస్పదంగా మారుతున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైతే అమరావతిని రాజధానిగా గత ప్రభుత్వం ప్రకటించి సాక్షాత్తు  దేశ ప్రధాని శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు ముక్కలాట పేరుతో రాజధానులను విభజించి  ఐదేళ్ల కాలంలో రాజధాని లేకుండానే ఎలాంటి అభివృద్ధి జరగకుండానే కాలం గడిచింది అంటే పాలకుల చిత్తశుద్ధి ఎంత అద్వాన స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.  అదే పద్ధతిలో  తెలంగాణ రాష్ట్రంలో కూడా గత టిఆర్ఎస్ ప్రభుత్వం  చెట్లకు గుట్టలకు పుట్టలకు రోడ్లకు ప్రాజెక్టులకు వంతెనలకు కూడా  రైతుబంధు పేరుతో అక్రమార్కులకు ప్రజాధనాన్ని కట్టబెట్టి  కోట్లాది రూపాయలను అప్పు చేసిన సంగతి మనకు తెలుసు. భూములు ఉన్న వాళ్లకు l అంతో ఇంతో  ఆదాయం ఆస్తి ఉంటుంది కానీ అసలే భూమి లేనటువంటి వారి గురించి ఆలోచించకుండా ఆ రకంగా దుర్వినియోగం చేయడం అంటే నిజంగా  ఆ విధానం పైన విచారణ జరగాల్సిందే.  అయితే ప్రస్తుత  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వాలు కూడా  మిగతా రాష్ట్రాలు కూడా  విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత నివ్వడం ద్వారా  ప్రభుత్వ రంగంలో ఉచితంగా అందించాల్సిన అవసరం ఉంది .గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగినటువంటి ప్రభుత్వం యొక్క  విధానాలను ఆదర్శంగా తీసుకొని  విద్యా వైద్య రంగాలలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తే ప్రజలు హర్షిస్తారు  అప్పుడే ప్రపంచంతో పోటీ,  ప్రపంచంలో మాకు ఎవరు సాటి లేరు అనే ప్రభుత్వాల యొక్క నినాదాలకు అర్థం ఉంటుంది. "అధికారంలో కొనసాగుతున్న ప్రభుత్వం ఏనాడు విద్యా వైద్యం ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని హామీ ఇచ్చిన దాఖల దేశంలో ఎక్కడా లేదు. అదే పార్టీ తిరిగి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత  ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలను కూడా విద్య వైద్యాన్ని డిమాండ్ చేసిన సందర్భాలు లేవు. అంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా  ఒకే తానులోను ముక్కలని తాత్కాలిక ప్రలోభాల మీద ఆధారపడి మాత్రమే కొనసాగుతున్నాయని  అందుకే ప్రజలు చైతన్యవంతులు కాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగమే ఈ వాగ్దానాలు ఉచితాలని  ఇప్పటికీ ప్రజలు అర్థం చేసుకోకపోతే భవిష్యత్తులో  ప్రజల గుండెల మీద కాలు పెట్టి  దాడి చేసి ఒప్పించి  గెలిచే రోజులు  వస్తాయేమోనని  ఆనాడు ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని రాజకీయ సామాజిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు."
       " ఇక  ఉద్యోగులు, రాజకీయ యంత్రాంగంలోనూ  అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది  ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు  అక్రమస్తులను కూడా పెట్టుకోవడం కోసం అనవసరంగా కొన్ని పనులను మంజూరు చేసి,  వాటిలో నాణ్యత లేకుండా చేసి,  నిర్మాణాల వరకే సరిపుచ్చి,  ప్రారంభానికి కూడా నోచుకోనటువంటి అనేక భవనాలు ఇప్పటికీ దేశవ్యాప్తంగా కోకొల్లలు.  ప్రజాధనాన్ని దూర్వినియోగం చేసే అధికారం పాలకులకు ఎక్కడిది?"  ""ఈ దేశంలో న్యాయ వ్యవస్థ తనకంటూ ఒక స్పష్టమైనటువంటి అవగాహన దృష్టితో  దేశంలో మూలమూలన కొనసాగుతున్న అధికార యంత్రాంగం రాజకీయ ప్రతినిధుల యొక్క అవినీతిపైన ఉక్కు పాదం మోపాలి. అందుకు  విచారణ జరపడం ద్వారా దోషులను శిక్షించి రాజకీయ అవినీతిని బట్టబయలు చేయాలి. పాలకులకు  గుండె దడబుట్టేలా  శిక్షలు విధించాలి ."కార్యనిర్వాహక  శాసన నిర్మాణ శాఖలు కూడా  సంపూర్ణంగా సమగ్రంగా  ప్రజల కోణంలో ఆలోచించకపోవడం, కార్పొరేట్ వ్యవస్థకు మద్దతు పలకడం  ఒక లోపం అయితే   ఇక స్వయం ప్రతిపత్తి గల న్యాయవ్యవస్థ కూడా   కఠిన నిర్ణయాలు తీసుకొని  దోషులను కఠినంగా శిక్షించడానికి అంతగా సాహసించడం లేదంటే ఈ దేశంలో రాజకీయ పార్టీల యొక్క ప్రాబల్యం ఎంతగా  వ్యాపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ప్రజలు ప్రజాస్వామ్యవాదులు గమనించి అవసరమైన మేరకు ప్రతిస్పందించాలి."
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ, గిరిజన  ప్రాంతాలు  వెనుకబడడానికి  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కారణం కాదా? నిధులన్నీ పట్టణాల్లో కుమ్మరించి,  తిండి పెట్టే రైతన్న పొలానికి బాట మరిచి, కనీస రహదారులు సౌకర్యాలు కరువు అo టే  ఇది వివక్షతే కదా!
---వడ్డేపల్లి మల్లేశం 
-రోడ్డు సౌకర్యం లేని  గ్రామాలు ఈ దేశంలో లేవని  లోతట్టు  మారుమూల ప్రాంతాలకు సైతం రవాణా సౌకర్యాలు  కల్పించినట్లు    ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి కానీ  మారుమూల ప్రాంతాలే కాకుండా మైదాన ప్రాంతాలలో సైతము  ముఖ్యంగా అటవీ గిరిజన ప్రాంతాలతో సహా  సరైన రహదారి సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాలను మనం స్పష్టంగా చూడవచ్చు. చిన్న పట్టణాలకు పొలిమేరలో ఉన్నటువంటి గ్రామాలలో కూడా  వ్యవసాయ బావుల వద్దకు వెళ్లడానికి ఒక గ్రామానికి మరొక గ్రామానికి ప్రయాణం చేయడానికి  శాశ్వతమైనటువంటి రహదారులు లేకపోగా చాలాచోట్ల  బండ్ల బాటలు  గ్రామీణులు ఏర్పాటు చేసుకున్నటువంటి పిల్లబాటలు  మాత్రమే ఇప్పటికీ  ఏకైక అవకాశాలుగా  మిగిలిపోవడాన్ని గమనిo చవచ్చు. గ్రామీణ ప్రాంతాలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెడుతున్నటువంటి ఖర్చు లేదా కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు నామ మాత్రమే.  అదే పట్టణ ప్రాంతాలకు సంబంధించిన  వివిధ సౌకర్యాలు  విద్యా విజ్ఞాన వైద్య సంస్థల ఏర్పాటుతో పాటు  రింగ్ రోడ్లు  మినీ రైల్వే సౌకర్యాలు విద్యాలయాలు  వంతెనలు  ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ వంటి వాటి పైన చేస్తున్న ఖర్చు  వందలు, వేల కోట్లు దాటుతున్నది.  గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కనీస సౌకర్యాలు కల్పించడానికి  శాశ్వత రోడ్డు సౌకర్యాలను విస్తరింప చేయడానికి మాత్రం ప్రభుత్వాలకు మనసొ ప్పదు.  ఒకవేళ రోడ్డు సౌకర్యం కల్పించిన అది సింగల్ రోడ్డు రూపంలో  ఒక్క వాహనం మాత్రమే ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటే ఎదురుగా వాహనాలు వచ్చినప్పుడు సంగతేమిటి?  అంతెందుకు  గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా వ్యవసాయదారులు ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణ ణా తీతం. బావుల వద్దకు  వ్యవసాయ భూముల దగ్గరికి  వెళ్లడానికి  ట్రాక్టర్,  కోత, కలుపు, నాటు మిషన్లు  తమ తమ కార్యక్రమాలను కొనసాగించడానికి  రహదారులు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితిలో  అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్న విషయాన్ని కూడా గమనించాలి. దశాబ్దాల క్రితం  ఉన్నటువంటి పిల్ల బాటలే తప్ప ఇప్పటికీ  రహదారుల స్థితిగతులు మారనటువంటి ప్రాంతాలు కూడా అనేకం. ఇక బాటకు ఇరువైపులా చెత్తాచెదారం ముండ్ల కంపలు  రాళ్లు రప్పలతో ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో బాటలు రహదారులు  ఉంటే  గ్రామాలలో జీవించేవాళ్లు మనుషులు కాదా? లేక వీళ్లకు కనీస అవసరాలు ఉండవా? లేక వీళ్లు కనీసమైన సౌకర్యాలకు నోచుకోకూడదా?అనే మీ మాంస కలగక మానదు.  ఇటీవల తెలంగాణ రాష్ట్ర శాసనసభలో  ప్రతిపక్ష సభ్యులు కొందరు   గ్రామీణ ప్రాంతాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రస్తావిస్తూ  బావులు చేల వద్దకు వెళ్లడానికి కచ్చితంగా రహదారులను ప్రభుత్వమే నిర్మించాలని  అప్పటికి అరకొరగా ఉన్నటువంటి దారులను విస్తరింప చేయడం ద్వారా  సులభంగా ప్రయాణించడానికి సౌకర్యాలు కల్పించాలని కోరిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించవలసిన అవసరం ఉంటుంది .
        పట్టణాలపై ఇంత మోజె o దుకు?  నగరీకరణ దీర్ఘకాలంలో ప్రమాదకరమే! 

అనేక ప్రమాదకరమైన స్థితులలో ఉన్నటువంటి నిర్మాణాలను  అత్యంత సాహసంతో నిర్వహిస్తున్న మాట వాస్తవమే కానీ అప్పుడప్పుడు అది  ప్రమాదాలకు గురై  ఎంతోమంది చావులకు బలవుతున్నటువంటి సందర్భాన్ని గమనించవచ్చు. భూగర్భ ప్రయాణాలు, రసాయన పరిశ్రమలు,  జల ప్రయాణాలు  విమాన ప్రయాణాలలో  ఇటీవల అనేక ప్రమాదాలు చోటు చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి భూమార్గాలకు అత్యధిక ప్రాధాన్యత నివ్వడం ద్వారా కొంత రక్షణ పొందే అవకాశం ఉంటుంది  అందుకు నె లవైనటువంటి ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలే కనక గ్రామీణ ప్రాంతాలను విస్తరింప చేయడం, చిన్న పట్టణాలను అభివృద్ధి చేయడం, అభివృద్ధి కేంద్రాలుగా చిన్న పట్టణాలను తీర్చిదిద్దడం, ముఖ్యమైనటువంటి  విద్యాసంస్థలు  సాంకేతిక కేంద్రాలుగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసినట్లయితే జనాభాను కేంద్రీకరించకుండా అరికట్టడానికి గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి ప్రమాదాలను నివారించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళిక  పరిధిలో కేటాయించిన నిధులలో అత్యంత  అగ్ర భాగం పట్టణ ప్రాంతాలకు  ఉన్నత వర్గాలకు మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు పేద మధ్యతరగతి వర్గాలకు నామమాత్రంగానే నిధులు కేటాయించబడుతున్నట్లు మేధావులు సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.   ఈ దేశానికి తిండి పెట్టే రైతన్నలు, కుటీర పరిశ్రమలు, చేతివృత్తులు, కార్మికులు, ఎక్కువగా  నివసిస్తూ  ఉత్పత్తులు పెంచుతూ దేశాభివృద్ధిలో పాల్గొంటున్న వాళ్లంతా కూడా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్ళు. గ్రామీణ ప్రాంతాలలో జీవిస్తున్న వాళ్లు కానీ గ్రామీణ ప్రాంతాలకు మాత్రం సౌకర్యాలు అరకొ రగా ఉండడాన్ని ఏ రకంగా సహించవచ్చు? జన సంచారము లేని దగ్గర  కిలోమీటర్ల పొడవునా కూడా  ఒకవైపు విద్యుత్ దీపాలు వెలుగుతూ ఉంటే  గ్రామాలలో మాత్రం ప్రజలు జీవించే చోట  చిన్న సందులలో  నెలల తరబడిగా వీధిలైట్లు వెలగకపోవడాన్ని గమనించినప్పుడు  ఈ దేశంలో పట్టణాలకు ఇచ్చిన ప్రాధాన్యతలో ఈశన్ మాత్రం కూడా గ్రామ ప్రాంతాలకు ఇవ్వడం లేదని అర్థం అవుతున్నది .అందువల్లనే  సకల సమస్యలకు పరిష్కారాన్ని చూపే గ్రామాలను విడిచి ప్రజలు పట్టణ ప్రాంతాలకు తరలిపోవడానికి పట్టణ జీవితానికి అలవాటు పడుతూ గ్రామాలను  పాత గోడలకు పరిమితం చేయడాన్ని గమనించినప్పుడు ప్రభుత్వాల యొక్క ద్వంద్వ వైఖరి మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా విద్యాసంస్థలు  ఆసుపత్రులు  ఉపాధి కల్పించే పరిశ్రమలు  సాఫ్ట్వేర్ రంగాలను కూడా గ్రామీణ ప్రాంతాలకు విస్తరింప చేయడం ద్వారా ప్రజలు ఎక్కడైనా ఈ దేశంలో బ్రతకవచ్చు అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది.  ప్రస్తుతము పట్టణ ప్రాంతాలు లక్షలు కోట్ల జనాభా కు చేరుకోవడంతో  కనీస సౌకర్యాలు మృగ్యమై  ప్రజలకు ఉపాధి కరువై,  పోటీ తత్వం పెరిగి, మురికి కాలువల పక్కన,  రోడ్డు కిరు వైపులా  అనాధలుగా జీవిస్తున్నటువంటి  సన్నివేశాలను గమనించినప్పుడు పట్టణాలు ఎదగడం అంటే ఇదేనా?లేక పట్టణ జనాభా పెరగడం అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినట్లా? ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. 
     మింగ మెతుకు లేకపోయినా మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుగా భారతదేశంలో  పేదరికం నిరుద్యోగము ఆకలి చావులు ఆత్మహత్యలు యదేచ్ఛగా కొనసాగుతుంటే సౌకర్యాల లేమితో  పేదరికం తాండవిస్తూ ఉంటే  పట్టణాలను మాత్రం అభివృద్ధి చేసే క్రమంలో కోట్ల నిధులను కేటాయిస్తు  అందాల పోటీలు నిర్వహించడం, దాబా లు,  క్లబ్బులు పబ్బులు ఈవెంట్ల పేరుతో కొనసాగుతూ ఉంటే వాటికి అనుమతించి  తద్వారా లభించే ఆదాయాన్ని పట్టణాల మీద కుమ్మరిస్తూ  ప్రభుత్వాలు తమ ఖర్చులు తీర్చుకోవడానికి పనిచేస్తున్నాయి తప్ప ఈ దేశంలో అధమ స్థాయిలో ఉన్న ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచడానికి, ఆరోగ్య పరిరక్షణకు, విద్య  సౌకర్యాల విస్తరణకు మాత్రం పూనుకోవడం లేదు. దానివలన గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ముఖ్యంగా పేద వర్గాలు విద్యా వైద్యానికి తమ ఆదాయంలో 60 --70% ఖర్చు చేయడం వల్ల పేదవాళ్లు మరీ పేదలుగా మారిపోతున్నారు.  సౌకగాలు గ్రామీణ ప్రాంతాలలో లేకపోవడం వల్ల పట్టణ ప్రాంతాలలోనే ఉండవలసి రావడంతో ఖర్చులు కూడా భారీగా పెరగడంతో సామాన్య ప్రజలకు కార్మికులకు విద్యార్థులకు కూడా అధిక భారం అవుతున్న విషయాన్ని కూడా పాలకులు  గమనించి  పట్టణ గ్రామీణ ప్రాంతాల జీవిత  ప్రమాణాలను  కాపాడే ప్రయత్నంలో పల్లెటూర్లను కూడా  బాధ్యతగా స్వీకరించి అభివృద్ధి చేసినప్పుడు మాత్రమే  పాలకులను ప్రజలు  గుర్తుంచుకుంటారు.  ఇప్పటికీ కొంతమంది పలుకుబడి కలిగినటువంటి ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాలను మాత్రమే బాగు చేసుకున్న  పరిస్థితి గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న కారణంగా  వివిధ ప్రాంతాల మధ్యన వివక్షత ఏర్పడిన విషయం మనకు  తెలుసు. నాయకత్వాన్ని బట్టి నియోజకవర్గాల మధ్యనే ఇంత తేడా ఉన్నప్పుడు పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్యన ఎంత తేడా???  ప్రభుత్వాల యొక్క వివక్షత,  సౌకర్యాల లేమి,గ్రామీణ ప్రజల పట్ల చిన్నచూపు అనే అంశాలు  క్షేత్రస్థాయిలో పర్యటిస్తే కానీ తెలియదు. ఇప్పటికీ చట్టసభలలో కొద్ది మంది  గ్రామీణ ప్రాంత నేపథ్యం కలిగినటువంటి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు ప్రశ్నించడం ద్వారా ప్రభుత్వాల దృష్టికి వెళుతున్నది. కా ని ప్రభుత్వాలు ఆ రకమైన ఆలోచన చేయడం లేదు. పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య విస్తృతమైనటువంటి వ్యత్యాసాన్ని గనక చూపితే అది  అసమతుల్యతకు దారి తీసే ప్రమాదం ఉంటుంది.  పట్టణ గ్రామీణ ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ప్రాంతం వారికి కనీసం అయినటువంటి సౌకర్యాలను  భారీగా కల్పించినప్పుడు మాత్రమే  గ్రామీణులలో ఆ రకమైనటువంటి  దురభిప్రాయాన్ని తొలగించవచ్చు. .మారుమూల గిరిజన ప్రాంతాలలో ఇప్పటికీ  విద్య వైద్యం వంటి కనీస వసతులు  కనుచూపుమేరలో అందుబాటులో లేకపోవడం నిజంగా  సిగ్గుచేటు. ప్రకృతిలో జీవించే గిరిజనులు ప్రకృతి వైద్యం  ద్వారా మాత్రమే తమ అవసరాలను తీర్చుకుంటున్నారని తెలిసినప్పుడు  ప్రభుత్వాలు అందిస్తున్న సహకారం సౌకర్యాలు   పాటివో  ప్రశ్నించుకోవలసి ఉంటుంది 

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026